ఆస్కార్ అవార్డు రేసులో తెలుగు సినిమా 'శ్యామ్ సింగరాయ్' సినిమా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పీరియాడిక్ ఫిల్మ్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుకు ఈ సినిమా నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా ఈ సినిమాలో నటించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీరియాడికల్ ఫిల్మ్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరికీ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.