ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని "గాడ్ ఫాదర్" మూవీ టీం మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ ఎనౌన్స్మెంట్ చేసింది. గాడ్ ఫాదర్ టీజర్ ఆగస్టు 21వ తేదీన విడుదల చేస్తామని స్పెషల్ పోస్టర్ తో ఎనౌన్స్ చేసారు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ మూవీ "లూసిఫర్" కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్ లపై RB చౌదరి, NV ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.