ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధమాకా : జింతాక్ మాస్సీ లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 12:45 PM

మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా "జింతాక్" అనే మాస్సీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే మంచి మాస్ సాంగ్ గా, పెప్పి మ్యూజిక్ తో ఈ పాట ఫ్యూచర్ లో చార్ట్ బస్టర్ గా నిలిచేలా కనిపిస్తుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, భీమ్స్, మంగ్లీ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్,వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రావు రమేష్, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేష్, తులసి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com