కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా 'ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పె యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాగార్జున తమహాగానే పేరుతో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడబోతున్నారు. ఈ ఆయుధం తాలూకు యాక్షన్ ప్రోమోను గురువారం రిలీజ్ చేశారు. ఈ స్వోర్డ్ మేకింగ్ వీడియోను ఇంట్రెస్టింగ్ గా చిత్రీకరించారు. లైటింగ్ మూడ్, బ్యాక్గ్రౌం డ్ స్కోర్, నాగ్ ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యా యి. ఈ యాక్షన్ ప్రోమో చివరలో ఆగస్ట్ 25న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం. ఏషియన్ సునీల్, శరత్ మరార్, రామ్మోహనరావు నిర్మాతలు.