చిరంజీవి పుట్టిన రోజున మెగా ఫ్యాన్స్ కు మెగా బ్రదర్ నాగబాబు సూపర్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మెగా ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ హీరోకు చేయని విధంగా లక్షలాది అభిమానులతో ఆగస్టు 22న హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మెగా కార్నివాల్ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్నివాల్‌కు మెగా అభిమానులంతా హాజరుకావాలని కోరారు.