అక్కినేని నాగార్జున నటించిన కొత్త చిత్రం "ది ఘోస్ట్". ఎప్పుడైతే మేకర్స్ ఈ మూవీ నుండి తమహగానే అంటే ఏంటి అంటూ గ్లిమ్స్ ను విడుదల చేసారో ఇక అప్పటినుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై, తమహగానే అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని విపరీతమైన క్యూరియాసిటీని చూపించారు.
నిన్న మేకర్స్ తమహగానే అంటే ఏంటి అన్న ప్రశ్నకు ఒక పవర్ఫుల్ అండ్ థ్రిల్లింగ్ వీడియోతో సమాధానం చెప్పడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వీడియోకు యూట్యూబులో 3 మిలియన్ కు పై చిలుకు వీక్షణలు రావడం విశేషం.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. భరత్ సౌరభ్ సంగీతం అందించారు. పోతే, ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa