అఖండతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కలెక్టర్ గా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది. గత ఏడాది టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా అఖండ నిలిచింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఎనిమిది నెలలు దాటిపోయినా మరో సినిమాపై సంతకం చేయలేదు ప్రగ్యాజైస్వాల్. సినిమా అవకాశాలు లేకపోయినా హాట్ ఫొటోషూట్‌లతో అభిమానుల మనసుల్ని దోచేస్తుంది ప్రగ్యాజైస్వాల్.గోల్డ్ కలర్ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో అందాలతో కనువిందు చేసింది. ఈ ఫొటోల్లో చూపు తిప్పుకోలేని అందంతో ప్రగ్యా క్యూట్‌గా ఉందని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa