టాలీవుడ్ సీనియర్ హీరో, భారతదేశం గర్వించదగ్గ అమోఘమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ టీజర్ యూట్యూబులో 5.9 మిలియన్ వీక్షణలతో దూసుకుపోతుంది. ఇంకా ఈ టీజర్ హిందీ వెర్షన్ కూడా 1.9 మిలియన్ వ్యూస్ ను సాధించి హిందీ జనాలను కూడా ఆకట్టుకుంటుంది.
మలయాళ హిట్ మూవీ 'లూసిఫర్(2019)' కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa