ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"రంగరంగ వైభవంగా" మూవీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 22, 2022, 11:21 AM

కొండపొలం లాంటి డిజాస్టర్ తదుపరి మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం "రంగరంగ వైభవంగా". కెరీర్ పరంగా వైష్ణవ్ కిది మూడవ సినిమా. ఇందులో కేతికాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, ఈ నెల 23వ తేదీన అంటే రేపు సాయంత్రం ఐదింటికి ట్రైలర్ విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. చూస్తుంటే, ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిరీశాయ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి DSP సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన థియటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa