ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటినుండే రజినీకాంత్ 'జైలర్' షూటింగ్ ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 22, 2022, 11:29 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం 'జైలర్'. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ కాగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ నేటి నుండే ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు విడుదల చేసిన రజిని ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. గంభీరంగా నడిచొస్తున్న రజిని ఈ పోస్టర్ లో మనకు కనిపిస్తారు. టైటిల్ కు తగ్గట్టు రజిని ఈ సినిమాలో పవర్ఫుల్ జైలర్ గా కనిపించబోతున్నారని ఈ పోస్టర్ ను బట్టి క్లియర్ గా అర్ధమవుతుంది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రను పోషిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa