ఏ సినిమా రిలీజ్ అవుతుందోనని సెర్చ్ చేసేవారు పెరిగిపోయారు. ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టుకుని సినిమా థియేటర్లకు వెళ్లే బదులు ఇంటిల్లిపాది ఓటీటీలలో ఒకటి కంటే ఎక్కువసార్లు సినిమాను చూడవచ్చునంటూ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లకు జై కొడుతున్నారు. మరి ఇదే తరుణంలో అదిరేటి సినిమాలు/ వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలు సిద్దమైపోయాయి. ఈ వారం రిలీజయ్యే లిస్టు ఎలా ఉందో తెలుసుకుందాం..అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు రంజిత్ తివారీ తెరకెక్కించిన చిత్రం ‘కట్‌పుట్లి’. తెలుగులో హిటైన రాక్షసుడు’ సినిమాకు ఇది రీమేక్.
సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.అలాగే టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం టాప్‌గన్ మార్వెరిక్. ఈ యాక్షన్ డ్రామా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టే ఈ చిత్రం ఆగష్టు 24ను అలాగే ఆగష్టు 26 నుంచి ‘సమరిటన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.అలాగే షెఫాలీషా ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్.
ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ అత్యంత పాపులారిటీని సంపాదించింది. దీని రెండో భాగం ఆగష్టు 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఢిల్లీలో జరిగిన ఓ సంచలన క్రైమ్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది.అలాగే హుమా కురేషీ ప్రధాన పాత్రలో రూపొందిన మహారాణి తొలి సీజన్.. వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు 25 నుంచి సీజన్ 2.
సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అలాగే వీటితో పాటు ‘శి హల్క్ ’ రెండో ఎపిసోడ్ ఆగష్టు 25న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. , ‘మేడ్ ఇన్ చెల్సియా- మాలోర్కా’ వెబ్ సిరీస్ ఆగష్టు 23 నుంచి హేయూ ఓటీటీ ద్వారా అందుబాటులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa