హిందీ జనాలు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్న "విక్రమ్ వేద" టీజర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. తమిళ బ్లాక్ బస్టర్ హిట్ 'విక్రమ్ వేద' కు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'వేద'గా హృతిక్ రోషన్, 'విక్రమ్'గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ గా హృతిక్ రోషన్, పవర్ ఫుల్ పోలీసాఫిసర్ గా సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
లేటెస్ట్ గా రిలీజైన టీజర్ లో హృతిక్, సైఫ్ ఇద్దరికీ ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఇద్దరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ లో చాలా మంచి శ్రద్ధ వచించినట్టు క్లియర్ గా తెలుస్తుంది. టీజర్ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరిచింది.
తమిళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రీ లే హిందీ లో కూడా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. రాధికా ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.