మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్లో "ఖిలాడీ" అనే సినిమాలో నటించి, ఆడియన్స్ నుండి తీవ్ర నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బిగ్ డిజాస్టర్ గా మిగిలింది.
కానీ, రమేష్ వర్మకు మాత్రం సినిమా ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యనే "రాక్షసుడు 2" మూవీ ప్రకటింపబడగా, లేటెస్ట్ గా "WHO" అనే పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చెయ్యబడింది.
రాక్షసుడు 2 లో కిచ్చా సుదీప్ హీరోగా చేస్తున్నారని అంటున్నారు. ఆయన చేస్తే పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కించే అవకాశాలున్నాయి. పోతే WHO మూవీ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. హిందీ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో రూపొందుతున్న ఈ మూవీకి DSP సంగీతం అందిస్తున్నారు.
రమేష్ వర్మకు ఒకేసారి రెండు పాన్ ఇండియా మూవీ అవకాశాలు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచే విషయమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa