"సీతారామం" సినిమాతో బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి దిగుమతి చెయ్యబడిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతగా నటించి, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసిన మృణాల్ కు ఇక్కడ వరస ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి.
ఈ ఆఫర్స్ లో ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా ఉందని అంటున్నారు. సీతారామం మేకర్స్ వైజయంతి బ్యానర్ లోనే మృణాల్ ఈ సినిమాను చెయ్యబోతుందట. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ చెయ్యనున్నారట. మరైతే ఈ విషయంలో జోరుగా ప్రచారమైతే జరుగుతుంది కానీ, మృణాల్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa