ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లైగర్'​ ఫస్ట్ డే కలెక్షన్స్​ ఎంతంటే?

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 11:06 AM

విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే నటించిన తాజా మాస్ ఎంటర్టైనర్ చిత్రం "లైగర్". భారీ అంచనాలతో నిన్న విడుదలైన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు నమోదు చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.  'లైగర్' సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్​ కూడా నిరాశపరిచాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 13.35 కోట్ల షేర్​, 24.5కోట్ల గ్రాస్​ రాబట్టింది. నిజాం, ఏపీ​ కలిపి రూ.9.55 కోట్ల షేర్​, రూ.15 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది. దాదాపు 3వేలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa