ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా చాన్నాళ్ల తరవాత వెండితెరపై కనిపించిన చిత్రం "మై డియర్ భూతం". ఇదొక చిన్నపిల్లల సినిమా. ఇందులో ప్రభుదేవా జీనీగా నటించాడు. ఈ సినిమా మొత్తం ఒక చిన్న పిల్లాడికి, జీనీకి మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం.
కోలీవుడ్ డైరెక్టర్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు. ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతమందించారు. ప్రభుదేవా తో పాటు ఈ సినిమాలో సంయుక్త, ఇమ్మాన్ అన్నచి, సురేష్ మీనన్ తదితరులు నటించారు.
థియేటర్లలో మంచి స్పందన అందుకున్న తదుపరి లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 2 నుండి ప్రఖ్యాత జీ 5 ఓటిటిలో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa