నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన కార్తికేయ2 సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే తాజాగా ఈ రోజు వసూళ్లతో కలిపి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని యూనిట్ కూడా భావించలేదు. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.
నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై ఇన్ని రోజులైనప్పటికీ, నిన్నటికి నిన్న వర్కింగ్ డే అయినప్పటికీ.. ఈ సినిమాకు ఉత్తరాదిన 89 లక్షల రూపాయల నెట్ రావడం విశేషం. ఈ శనివారం, ఆదివారం సినిమాకు ఉత్తరాదిన మరిన్ని వసూళ్లు వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.
వంద కోట్ల క్లబ్ లో చేరిన ఆనందాన్ని ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటోంది యూనిట్. ఈరోజు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నారు చిత్ర యూనిట్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa