రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ.దివ్యాంశ కౌశిక్ కథానాయిక. వేణు కీలక పాత్ర పోషించారు. జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు సోనీలివ్ తీపికబురు చెప్పింది. సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'రామారావు ఆన్ డ్యూటీ'ని అందుబాటులోకి తెస్తున్నట్లు సోనీలివ్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa