ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ గెరార్డ్ పిక్‌తో 11 ఏళ్లుగా పాప్ సింగర్ షకీరా సహజీవనం చేసింది. అయితే జూన్, 2022లో ఆ జంట బ్రేకప్ చెప్పుకుంది. అయితే ఇది జరిగిన నెలకే ప్రముఖ మోడల్ క్లారా చియాతో గెరార్డ్ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. వారి ఫొటోలు వైరల్ కావడంతో షకీరా బాధతో కుంగిపోయినట్లు తెలుస్తోంది. అవి చూసి నా గుండె పగిలినట్లైందని మీడియా వద్ద తాజాగా ఆమె వ్యాఖ్యానించింది.