బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక ఇబ్బంది పడుతుంటే, అగ్నికి ఆజ్యం తోడైనట్టు హిందీ సినిమాలను అంటే బాలీవుడ్ రంగాన్ని బాయ్ కాట్ చెయ్యమంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, ట్రోల్స్, మీమ్స్ ... హిందీ సినిమాలకు ప్రేక్షకాదరణను దూరం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ "లాల్ సింగ్ చద్దా"తో మొదలెట్టిన ఈ బాయ్ కాట్ నినాదాలు తదుపరి అక్షయ్ కుమార్ "రక్షా బంధన్" కు, లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ "లైగర్" సినిమా వరకు పాకాయి. సరికొత్తగా ఈ బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ లు ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాకు తగులుకున్నాయి.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఇండియాస్ మిస్టికల్ విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించగా, కరణ్ జోహార్ నిర్మించారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
![]() |
![]() |