ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుల్ వైరలవుతున్న "ఆదిపురుష్" కాన్సెప్ట్ పోస్టర్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 05:18 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి బాలీవుడ్ డైరెక్టర్ తో చేస్తున్న చిత్రం "ఆదిపురుష్". 'తన్హాజి' ఫేమ్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకుడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్ పోస్టర్లు విడుదలై సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఐతే, వీటిని అఫీషియల్ గా మూవీ మేకర్స్ రిలీజ్ చెయ్యలేదు కానీ, కొంతమంది ఫ్యాన్స్ రెండ్నెల్ల క్రితం ఆర్ట్ స్టేషన్ లో పోస్ట్ చెయ్యబడిన ఈ ఫోటోలను ఎలాగోలా సంపాదించి, సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో అభిమానులు ఈ ఆర్ట్ పోస్టర్ల వర్క్ కు మనసు పారేసుకుంటున్నారు. ఇవే ఈ రేంజ్ లో ఉంటే, సినిమా ఇంకే రేంజులో ఉంటుందో అని భారీ అంచనాలను పెంచుకుంటున్నారు.
దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారముగా తెరకెక్కబడింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa