ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్దుల వెనుక ప్రేమ‌క‌థ‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 26, 2018, 11:17 AM

హెబ్బా పటేల్‌, అరుణ్‌ ఆదిత్‌ జంటగా దర్శకుడు అయోధ్య కుమార్‌ కృష్ణంశెట్టి రూపొందిస్తున్న చిత్రం 24 కిస్సెస్‌. సిల్లిd మాంక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో రెస్పెక్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల, అయోధ్య కుమార్‌ నిర్మాతలు. 24 కిస్సెస్‌ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని చిత్ర యూనిట్‌ చెబుతున్నారు. నవంబర్‌ 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా విశేషాలు తెలిపారు. దర్శకుడు అయోధ్య కుమార్‌ కృష్ణంశెట్టి మాట్లాడుతూ…సినిమా పేరు చూసి ఇందులో ముద్దులు మాత్రమే ఉంటాయని కొందరు అనుకోవచ్చు. కేవలం ముద్దుల కోసమే సినిమా చూసేందుకు ఎవరూ రారు. 24కాదు 50 ముద్దులు ఉన్నాయన్నా సినిమా చూడరు. ముద్దుల వెనకాల మంచి ప్రేమ కథ ఉంటుంది.


నేను మిణుగురులు సినిమా చేసినప్పుడు మాధ్యమాలు సహా చాలా మంది సహకారం అందించారు. ఇప్పుడు కూడా మా సినిమా బాగుంది అనుకుంటేనే సహకరించండి. అరుణ్‌ ఆదిత్‌, హెబ్బా చాలా కష్టపడి నటించారు. అన్నారు. అరుణ్‌ ఆదిత్‌ మాట్లాడుతూ…నేను తుంగభద్ర సినిమా చేస్తున్నప్పుడు నాని మా ప్రచార కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. అరేయ్‌ నువ్వు బాగుంటావు, మంచి ప్రేమ కథలు చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ప్రేమ కథలో నటించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయోధ్య కుమార్‌ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో లోతైన కథ అనిపించింది. చాలా మంచి సినిమా అవుతుంది. అన్నారు. నరేష్‌ మాట్లాడుతూ…అయోధ్య కుమార్‌ ప్రతిభావంతమైన దర్శకుడు. ముందు ముందు ఇంకా మంచి చిత్రాలు చేస్తారు. కొన్నేళ్ల కిందటైతే ఇలాంటి సినిమా హీరోగా చేసేందుకు సంతోషించేవాడిని. అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa