తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2)
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2)
సా సనిసగసా సగమా మా
మగమపమా మపనీ పా పమపనిసా సానీ
సాగస నీసని పానిప మాపమ గామగసా
॥సనిసగసా॥
చెవులారా వింటూనే ఎంత పాఠమైనా
ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు
కనులారా చదివింది ఒకసారే ఐనా
కల్లోను మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా ఛాయిస్‌లో పోనివ్వు
ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు పణ్ణివ్వు
ఏ టెన్షన్ దరికిరాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీటుపైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
తలస్నానం చెయ్యకుండా పూజించానంటూ
నావైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ
వాషైపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే
మా తలరాతలు తారుమారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దెయ్ బంగారూ
పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
![]() |
![]() |