2016లో యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి తమిళ మూవీ నిబునన్ సినిమా చేశాను. అప్పుడు ఓ రొమాంటిక్ సీన్‌లో అతను నన్ను కౌగిలించుకొని తడుముతుండడం నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని భయంకరమైన సంఘటనలు కూడా నా దృష్టికి రాగా, వాటిని నుండి తెలివిగా తప్పించుకోగలిగాను అని మీటు వేదికగా హీరోయిన్ శృతి హరిహరన్ ఆరోపించింది. దీంతో ఈ వివాదాన్ని చల్లబరిచేందుకు కర్నాటక ఫిల్మ్ చాంబర్ రంగంలోకి దిగింది..ఛాంబర్ అధ్యక్షుడు అంబరీష్ ఈ వివాదానికి స్వస్తి పెట్టాలని ఇద్దరిని పిలిచి ముఖాముఖి చర్చలు జరిపాడు. అయితే ఎంతగానో ప్రయత్నించినప్పటికి ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా మెట్టుదిగలేదు. అర్జున్ తనకి శృతి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరగా ఇందుకు శ్రుతి.. ‘నేను ఇప్పటికీ నా మాట మీదే నిలబడతాను.
నాకు ఏది సరైనది అనిపిస్తుందో దాని కోసమే పోరాడతాను. నేను మాత్రం క్షమాపణలు చెప్పను’ అని తేల్చి చెప్పింది.మీటూ అనేది మహిళలు, యువతులకు మంచి వేదికని, కానీ దాన్ని దుర్వినియోగం చేయవద్దని హితకు పలికాడు అర్జున్ . తనకు క్షమాపణ చెప్పకుంటే ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని శృతితో చెప్పేశాడు. తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో కూడా తనకు తెలియడం లేదని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు.. కాగా అర్జున్ తరఫున అతని మేనల్లుడు ధృవ బెంగళూరు సివిల్ న్యాయస్థానంలోశృతిపై రూ.5 కోట్ల దావా వేశాడు. అంతేకాదు సోషల్ మీడియాని ఉపయోగించి తనపై లేనిపోని ఆరోపణలు శృతి చేస్తుందని చెబుతూ 400 పేజీల ఫిర్యాదు నివేదికని తయారు చేసి ఆమెపై పోలీసు కేసు పెట్టాడు.