బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 26వ తేదీన హాజరుకావాలని జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలిచ్చింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేయడంతో ఇప్పటికే ఆమెకు చెందిన రూ.7 కోట్ల ఆస్తుల్ని ఈడీ ఫ్రీజ్ చేసింది.