టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం "ఒకేఒక జీవితం". వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని అమల కీలక పాత్రను పోషిస్తున్నారు.
తమిళంలో 'కణం' గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి కొంచెంసేపటి క్రితమే మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు . తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు విడుదల కాబోతుందని తెలిపారు.
డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రకాష్ బాబు, ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకార్తిక్ డైరెక్టర్. జెక్స్ బిజోయ్ సంగీతం అందించగా, సెప్టెంబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.