శాండల్ వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ పేరు మీదుగా ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఒక ప్రత్యేకమైన ఎన్వలప్ కవర్ ను తీసుకురాబోతుంది. ఇటీవలే కన్నడ సినీ పరిశ్రమలో సుదీప్ పాతికేళ్ళను పూర్తి చేసుకున్నారు . ఈ సందర్భంగా డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుదీప్ పేరు మీదుగా స్పెషల్ ఎన్వలప్ కవర్ ను తీసుకురాబోతుంది. డిపార్ట్మెంట్ నుండి కొంతమంది అఫీషియల్స్ సుదీప్ స్వగృహానికి వెళ్లి, ఎన్వలప్ లాంచ్ ఈవెంట్ కు రావలసిందిగా కోరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఈవెంట్ జరగనుంది. సుదీప్ కు దక్కిన ఈ అరుదైన గౌరవంతో కన్నడ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
![]() |
![]() |