పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ తమ్ముడు సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే మరో సూపర్ హిట్ జల్సా చిత్రాన్ని సైతం ఈరోజు థియేటర్లలో విడుదలచెస్తారు . పవర్ స్టార్ ఫ్యాన్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఆయనకు ప్రత్యేక క్రేజ్ ఉంది. పవన్ గురించి బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దేవర అంటూ పిలుచుకునే బండ్ల గణేష్.. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. పవన్ బర్త్ డే రోజున ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ ఉన్నట్లు తెలిపారు. ఇటీవల బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం డేగల బాబ్జీ. ఈ సినిమా ఆహా డిజిటల్ వేదికగా పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో బండ్ల గణేష్ ఏకపాత్రాభినయంతో నటించి మెప్పించారు. తమిళంలో ఒత్తసెరుప్పు 7 అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. మే 20న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ బర్త్ డే రోజున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.