ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZEE5లో 'విక్రాంత్ రోనా' సంచలనం

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 06:53 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ZEE5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్ సెప్టెంబర్ 2, 2022న ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, OTT విడుదలైన 24 గంటల్లో ఈ చిత్రం 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలని సాధించింది. ఈ సినిమాలో కిచ్చ సుదీప్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa