తాజాగా నటించిన సినిమా ‘బబ్లీ బౌన్సర్’ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించాడు. మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 5న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తమన్నా పాల్గొంది. మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు జవాబిచ్చింది. ఈ చిత్రంలో ఆమె లేడీ బౌన్సర్‌గా నటిస్తుంది. హృతిక్ రోషన్ విక్కీ కౌశల్ తనకు ఇష్టమని తమన్నా చెప్పింది. హృతిక్, విక్కీలకు ఒక్క రోజు బౌన్సర్‌గా పనిచేయాలని ఉండాలి అని అడిగింది . ఉత్తర భారతదేశంలోని బౌన్సర్ల గ్రామం అసోలా ఫతేఫూర్‌ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. గతంలో ఎన్నడు చేయని పాత్రను ఈ సినిమాలో తమన్నా చేసింది. ఈ మూవీ నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. ‘డిస్నీ+హాట్ స్టార్’ లో సెప్టెంబర్ 23 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా, సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిల్ వెయిద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘బబ్లీ బౌన్సర్’ ను జంగ్లీ పిక్చర్స్, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.