డైరెక్టర్ కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన "జనతా గ్యారేజ్" ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో మరొక సినిమా రాబోతుండడంతో దానిపై ప్రేక్షకుల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
తారక్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ప్రకటించిన ఈ మూవీ నుండి ఒక్క మోషన్ పోస్టర్ తప్పించి, అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాపై ఒక ఎక్జయిటింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం కొరటాల శివ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించినట్టు వినికిడి. ఐతే, ఇంకా విజయశాంతి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కొరటాల ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడట. విజయశాంతి ఒప్పుకుంటే కనక ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపవ్వడం ఖాయం.
![]() |
![]() |