టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుండి ఇటీవల విడుదలైన కొత్త చిత్రం "లైగర్" ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లైగర్ డిజాస్టర్ టాక్ కు పూరి డైరెక్షన్ లోపమే ప్రధాన కారణమని చాలామంది అనుకుంటున్నారు.
ఈ విషయం పక్కన పెడితే, లైగర్ ఫ్లాప్ అవ్వడంతో విజయ్ దేవరకొండతో చెయ్యాల్సిన "JGM" ను అటకెక్కించేసాడు పూరి. ఈ సినిమా ఆగిపోయిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కూడా పక్కన పెడితే, "ఇష్మార్ట్ శంకర్"తో గ్రాండ్ కం బ్యాక్ సక్సెస్ అందించిన హైపర్ ఎనర్జిటిక్ హీరో రామ్ తోనే తిరిగి పూరి జట్టు కట్టాలని భావిస్తున్నాడట.
అటు రామ్ కూడా వారియర్ సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఇష్మార్ట్ శంకర్ కి సీక్వెల్ రాబోతుందని లేటెస్ట్ క్రేజీ టాక్. ఆల్రెడీ రామ్ బోయపాటితో పాన్ ఇండియా సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఐతే మరి, వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.