అజయ్, మోడల్ విర్తి వఘాని జంటగా నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ "కొత్తకొత్తగా". హనుమాన్ వాసంశెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన అంటే రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఫ్రెష్ కంటెంట్ తో యూత్ ను ఆకర్షించే విధంగా ఉన్న ట్రైలర్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై BG గోవిందరాజు సమర్పిస్తున్న ఈ సినిమాను మురళీధర్ రెడ్డి ముక్కరా నిర్మిస్తున్నారు.
2008లో వచ్చిన సూపర్ హిట్ డ్రామా సిరీస్ "జై శ్రీ కృష్ణ" లో చైల్డ్ రాధగా నటించిన విర్తి వఘాని ఆపై మోడల్ గా పలు ప్రచార ఉత్పత్తులను ప్రోమోట్ చేసింది. తాజాగా హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది.