కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా ‘కే3 కోటికొక్కడు’. ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి శివ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఇపుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ కానుంది.ఈ సినిమాని గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించారు.