బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా "బ్రహ్మాస్త్ర". పాన్ ఇండియా భాషల్లో ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కొంతమంది ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటుంటే మరికొంతమందేమో డిజాస్టర్ అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ సినిమాపై చాలా ఓపెన్ గా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీని జీనియస్ అని మెచ్చుకుంటున్న ప్రతిఒక్కరిని తక్షణమే జైల్లో వెయ్యాలి అని ఆమె పోస్ట్ లో పేర్కొంది. అంతేకాక, ఈ సినిమా కోసం 12ఏళ్ళు కష్టపడి మరీ 600కోట్లను బుగ్గిపాలు చేసాడు... 14మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్లను మార్చాడు ...చివరి నిమిషంలో హీరో పేరును శివ అని మార్చేశాడు... అని అయాన్ పై కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆల్రెడీ నార్త్ లో ఈ సినిమా పట్ల తీవ్ర నెగిటివిటీ ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు కంగనా చేసిన ఈ కామెంట్స్ బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర గ్యాంగ్ కు బలమైన ఆయుధంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |