ఈ రోజు సాయంత్రం విడుదలైన "కృష్ణ వ్రింద విహారి" ట్రైలర్ కు యూట్యూబులో ఆడియన్స్ విశేష స్పందన చూపిస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్, 70కే లైక్స్ రాబట్టింది. తాజాగా విడుదలైన ట్రైలర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేసింది.
అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంతో సెప్టెంబర్ 23న విడుదలయ్యే సినిమాపై పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి.