"నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం నుండి ఇటీవలే నచ్చావ్ అబ్బాయ్ అనే సాంగ్ విడుదలై పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ ఫోర్త్ లిరికల్ 'చాలా బాగుందే' అనే పాటను రేపు సాయంత్రం ఐదింటికి విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ పదహారున విడుదల కాబోతుంది.
![]() |
![]() |