ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా తన స్పీడ్ ను పెంచేస్తూ ఒక ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు
తమిళ దర్శకుడు టి.ఎన్. కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలు కానుంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే కార్తికేయ తమిళ ప్రేక్షకులకి కూడా పరిచయం కానున్నాడన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa