నిర్మాత,నటుడు బండ్ల గణేష్ తాజాగా బండ్ల కుర్ర హీరోలపై ట్వీట్ చేసాడు. టాలీవుడ్ కుర్ర హీరోల పవన్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ ఓ ఈవెంట్‌లో కాలు వేసుకుని కూర్చున్నారు. ఆ ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ పెద్దల ముందు వినయంగా కూర్చున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..'నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం' అని బండ్ల గణేష్ ట్విట్ చేసాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa