కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం "నానే వరువేన్". సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
సెప్టెంబర్ 29న తమిళ భాషలో విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగులో "నేనే వస్తున్నా" టైటిల్ తో టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఇరు తెలుగు రాష్ట్రాలలో విడుదల చెయ్యబోతున్నారు. ఈ విషయమై గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
తెలుగులో కూడా సెప్టెంబర్ 29న విడుదల కాబోతుంది. ప్రభు, యోగిబాబు, సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa