కొంచెంసేపటి క్రితమే "స్వాతిముత్యం" టీజర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ టీజర్ ప్రేక్షకులకు రెఫ్రెషింగ్ ఫీల్ ను తీసుకొచ్చేలా ఉంది. నటుడిగా గణేష్ తొలి సినిమా ఇదే అయినప్పటికీ, కంగారు, కన్ఫ్యూషన్ కలబోసిన బాల పాత్రలో చాలా చక్కగా నటించాడు. అలానే హీరోయిన్ వర్ష, గణేష్ ల మధ్య వచ్చే సీన్లు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ఈ టీజర్ తో పూర్తి ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఆడియన్స్ క్యూరియస్ గా ఉన్నారు.
గణేష్ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ విడుదలైంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడే గణేష్. లక్ష్మణ్ కే కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అక్టోబర్ ఐదవ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa