ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప' సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులోని 'సామి నా సామి' పాటకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యువతులు సందడి చేశారు. ఇదే పాటకు ఓ చిన్నారి స్టెప్పులేసి రష్మికను మెప్పించింది. దీంతో.. ఆ చిన్నారిని కలవాలనుకుంటున్నాను, ఎలా కలవాలో చెప్పాలంటూ ట్వీట్ చేసింది. నెటిజన్లు స్పందిస్తూ.. చిన్న రష్మిక అని కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |