టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే ది వారియర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటలేకపోయింది.
తదుపరి రామ్ బోయపాటితో పాన్ ఇండియా సినిమా చెయ్యడానికి రెడీ అయిపోయాడు. మొన్నీమధ్య రామ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చెయ్యబోతున్నాడని ప్రచారం జరిగింది.
లేటెస్ట్ గా వీరిద్దరితో కాకుండా రామ్ కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం కధకు సంబంధించిన చర్చలు తనకు రామ్ కు మధ్యన జరుగుతున్నాయని, మాక్జిమం వచ్చే ఏడాది తమ కాంబోలో మూవీకి ముహూర్తం కుదరవచ్చని తెలిపారు. స్రవంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించబోతుందట. ఈ లోపు రామ్ కూడా బోయపాటి, హరీష్ ల సినిమాలను చేసేసి గౌతమ్ సినిమా కోసం సిద్ధంగా ఉంటాడన్న మాట. మరి, ఈ విషయంలో రామ్ ఎలాంటి స్పందన తెలియచేస్తాడో చూడాలి.