క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా. ఈ మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, తాజాగా ఈ చిత్రం ట్రయిలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రయిలర్ ఆరంభంలో హారర్ సీన్ భయపెట్టేలా ఉండగా, ‘నీ యబ్బ… జాబ్ చూడరా అంటే జిమ్నాస్టిక్స్ చేయిస్తావేంట్రా’ అంటున్న విజయ్ డైలాగ్ అలరిస్తోంది. ఆపై అతను ఓ కారును కొనడం, టాక్సీవాలాగా మారడం, హీరోయిన్ తో పరిచయం, ఆమె మందు కొట్టి పడిపోతే, “నేను మంచోడిని కాబట్టి సరిపోయింది కానీ…” అంటున్న విజయ్ కనిపిస్తున్నాడు. ఆపై ఓ పాట, కొన్ని సీన్స్, ఇందులో చూపారు. “ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది. కానీ నమ్మండి”… “కారులో దెయ్యం ఉంది” అని విజయ్ చెప్పడం సినిమా హారర్ జోనర్ ను టచ్ చేసింది.ఈ ట్రైలర్ గత రాత్రి 9 గంటలకు విడుదల కాగా కేవలం 12 గంటల వ్యవధితో ఏకంగా 9 లక్షల వ్యూస్ లభించాయి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa