పల్లవి:
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
చరణం 1:
నువ్వుంటు పుట్టినట్టు నాకొరకు
ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది గాని ఈడు ఒంటి వరకు
వేదించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు
ఈ అల్లరి ఈ గారడి నీ లీలే అనుకోన
నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
ఓ యవ్వన వీణ పువ్వుల వాన
చరణం 2:
ఏ పూల తీగ కాస్త ఊగుతున్న
నీ లేత నడుమే అనుకున్నా
ఏ గువ్వ కిలకిల వినపడినా
నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనబడిన
ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా