బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్ మరికొద్ది గంటల్లో పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇటలీలోని విలా డెల్ బాల్బియానెలొలో ఉన్న లేక్ కోమోలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఇక వారి వివాహం బుధ, గురువారాల్లో హిందూ, సిక్కు సాంప్రదాయం ప్రకారం జరగనుంది. ఇక తమ పెళ్లికి వచ్చే వాళ్లు బహుమతులు కూడా తీసుకు రావద్దని ఈ జంట ప్రత్యేకంగా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.. తమకు గిఫ్ట్‌లు ఇచ్చే బదులు ఆ మొత్తాన్ని తన ఎన్జీవో ద లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని ఈపికా కోరింది.. అలాగే వధువు, వరుడు తమపై కాసులు, నోట్ల వర్షం కురిపించవద్దని వినమ్రంగా కోరారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa