యాక్షన్ కింగ్ అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి శ్రుతి హరిహరణ్ గతంలో ఆరోపించింది. దీంతో ఆమెపై రూ.5 కోట్ల పరువునష్టం దావాను అర్జున్ దాఖలు చేశాడు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శ్రుతి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అర్జున్ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. తాను చేసిన ‘మీ టూ’ ఆరోపణల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే అర్జున్ ఈ కేసును పెట్టాడని ఆమె ఆరోపించింది. కాగా, శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa