శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా నటిస్తున్న చిత్రం "అల్లూరి". ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం విడుదల కాబోతుంది. ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు నాచురల్ స్టార్ నాని అల్లూరి ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు. పోతే, ఈ మూవీ సెప్టెంబర్ 23వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాకు ప్రదీప్ వర్మ డైరెక్టర్ కాగా, బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది.