టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ - హీరో రానా కాంబోలో రెండేళ్ల క్రితం "హిరణ్య కశ్యప" అనే సినిమా అధికారికంగా ప్రకటింపడిన విషయం తెలిసిందే.
కొన్ని కారణాల వల్ల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ, మరోసారి ఈ మూవీ న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది. గుణశేఖర్ కి బదులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీని డైరెక్ట్ చెయ్యబోతున్నారని వినికిడి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న సినిమా తదుపరి త్రివిక్రమ్ ఈ సినిమానే లైన్ లో పెట్టబోతున్నారట.
ఈ సినిమాకు డైరెక్టర్ ఎలా ఐతే మారుతున్నారా, అలానే నిర్మాత కూడా మారబోతున్నారట. ముందుగా ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించాలని అనుకున్నారు. ఇప్పుడేమో హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మాతగా వ్యవహరించబోతుందని టాక్. ఐతే, ఈ విషయాలన్నిటిపై కూడా అధికారిక క్లారిటీ రావలసి ఉంది.