ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డులకు సంబంధించి వచ్చే ఏడాది నామినేషన్స్ పై ప్రస్తుతం పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం చెయ్యబడుతున్నాయి.
భారతదేశం నుండి రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR సినిమాకు ఆస్కార్ అవార్డుల జాబితాలో తప్పక చోటు లభిస్తుందని అందరి నమ్మకం. లేటెస్ట్ గా వెరైటీ మ్యాగజైన్ వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రెడిక్షన్ లిస్టును రిలీజ్ చేసింది. గత నెల జాబితాతో పోల్చుకుంటే ఈ నెల RRR తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి, బెస్ట్ యాక్టర్స్ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బెస్ట్ ఫీచర్ ఫిలింగా RRR, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ గా RRR లోని దోస్తీ సాంగ్ ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి.
చూడాలి, మన ఇండియా నుండి ఏ మూవీ ఆస్కార్ బరిలోకి దిగుతుందో..!!